పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

138

రాజవాహనవిజయము

ఆకనఁబడు స్త్రీకి, అమా = తల్లీ, అన్నెలంత = నినుబోఁటికీ. పొన్ను = బంగారము. (అనఁగా బంగారమువలె గౌరవించదగినది.) లాతిన్ = అన్యుని. పొగడఁదగునటే. నటన నటి నటన = నాట్యముఁ జేయునట్టి. నటి = ఆటకత్తె. దాడిమలకు = దానిమ్మలకు, దాడీ = జగడమునకుఁబోవుట.

లయవిభాతి.

మిసమిసని చన్నుగవశిపసకు వెస మార్మసలు
                 నసమకళిక ల్చిదుమ నెసఁగు తరిశాఖా
విసరములు గమ్మఁగర బిస నటనఁద్రోఁచి దర
                 హసనములతో మలయజసలహరికాస
త్కుసుమసమితి న్ముసరుభసలములసోఁగ జెడ
                 విసరి పొసఁగించి రోగిఁ బ్రసవహరణంబుల్
గిసలయనిభాతి పదలసనముల శోణరద
                 వసనముల నింపెసఁగు నసదృశకృణాంగుల్.

108


మ.

జలజాక్షీ, సురపొన్నయు న్వకుళము న్సంపంగియుం గ్రోవివా
విలి గోఁగుం దిలకంబుఁ జంపకము మావిం బ్రేంకణంబుం న్విరుల్
దలచూపెన్ హసియింపఁ దన్న మొగమెత్తం గౌఁగిటం జేర్చ నూ
ర్పులిడం బల్కు నదల్పఁ గల్లుమియఁ గేల్బొందిచినం బాడినన్.

109

109. సురపొన్న, వకుళ, సంపఁగి మొదలగునవి, హసియించుట, తన్నుట మొదలగు దోహదవిశేషము లిందు వర్ణితములు.

సీ.

వచనోన్నతికిఁ బ్రసనము గోఁగు గనిపించె
                 గంకేళి వనపదగతి కొసంగె