పుట:రాజవాహనవిజయము (కాకమాని మూర్తి).pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

137


కోవే మాధవి మాధవిం గదియఁబోకో పాటలిం బాటలీ
తేవే మాలిక మాలికా నుసలకేతే కేతకుల్ కేతకీ
రావే వల్లిక వల్లికా యచట నీరల్దూరగా నేటికిన్.

106

106. కోవే = పుచ్చుకోవే. నుసలక = ఆలస్యము చేయక, ఈరల్ = పొదలు. (ఇందు మంజరి మంజరి ఇత్యాది రెండు శబ్దములలో నొకటి చెలికత్తెల పేరు.)

సీ.

పాటలీతరులకై పాట లీనఁగ నేల
                 పాటలీకము సుమ్ము పంకజాక్షి
వట్టి వేరున కీవు వట్టివేరులు చేయ
                 వట్టివేరుటము లింపైనచెలికి
లే మావి తేనియ లే మావి యనిచాట
                 లేమా విచారంబు లేదె లేమ
పొన్నమా నిపు డింత పొన్నమానిని కిమ్ము
                 పొన్నమా నినుబోటి కన్నెలంత


గీ.

పొగడ కై లాఁతిఁ దగునటే పొగడ మగుడ
ననటి మాత్రంబునకు నట ననటి యనకు
దాడిమల కేల బాలపై దాడి మగువ
దిరిసెనము కంటె యిది విరుల్ విరిసెననుచు.

107

107. పాట లీనఁగ నేల = పాటల బాడ నెందుకు, పాటు = ఆయాసము. అలీకము = ఇష్టము కానిది, (ఇంపైన చెలికి, రుటములు = రూఢములు. అట్టివే.) ( తేనియలే, మావి, అనిచాటలేదా) పొన్నమానినికిన్ =