Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిత్య = ఎడతెగని, దానశీలము = ఈగినడకను, తగన్ = తగునట్లు, ఒక్కటి = ఒకగుణము, ఒక్కటికిన్ = మఱియొకగుణమునకు, అలంకృతి = సింగారమును, చేయఁగన్ = ఒనర్చునట్లుగా - ఒకటిచే నొకటి ప్రకాశింపఁగా ననుట, తాల్చి = ధరించి - అనఁగా నీగుణములు కలవాఁడై, అతిప్రసిద్ధుఁడై = ఇట్టిసద్గుణములు కలవాఁడు కనుకనే మిక్కిలి ఖ్యాతి జెందినాఁడని సంబంధము, విమలతన్ = నిష్కల్మషత్వముచేత - పాపకృత్యములు చేయనివాఁ డనుట, శోభిలున్ = ప్రకాశించును.

క.

వేంకటవరదుఁడు వెలయు ని, రంకుశవితరణనిరూఢప్రజ్ఞను రణని
శ్శంకితప్రాభవమున నక, లంకితకీర్తిప్రతాపలక్ష్ములమహిమన్.

35

టీక. వేంకటవరదుఁడు = వేంకటవరదరాజు, నిరంకుశ = అడ్డపాటులేని, వితరణత్యాగములందు, నిరూఢ = తీర్పు గల, ప్రజ్ఞను = బుద్ధిచేతను, రణ = కయ్యముచేత, నిశ్శంకిత = జంకు లేనిదిగాఁ జేయఁబడిన, ప్రాభవమునన్ = ఏలుబడిచేతను - అనఁగాఁ జక్కఁగా యుద్ధము చేయువాఁ డనుట, ఆకలంకిత = కలక లేనిదిగాఁ జేయఁబడిన, కీర్తిప్రతాపలక్ష్ముల = పొగడువేడుములసిరులయొక్క, మహిమన్ = ఎక్కువచేతను, వెలయున్ = ప్రకాశించును.

తే.

ఇట్టి యన్వయపరిశుద్ధి యింపుమీఱ
శ్రీవిరూపాక్షభక్తివిశేషవిమల
హృదయుఁ డగుచు సంగీతసాహిత్యనిత్య
సరసగోష్ఠీవినోదైకనిరతుఁ డగుచు.

36

టీక. ఇట్టి = ఈపూర్వోక్తమయినట్టి, అన్వయ = వంశముయొక్క, పరిశుద్ధి = గరగరిక, ఇంపు మీఱన్ = ముద్దు చెలఁగఁగా, ఇది (సతిసప్తమి) శ్రీవిరూపాక్షస్వామియందుఁగల, భక్తివిశేష = భక్త్యతిశయముచేత, విమల = కసటువాసిన, హృదయుఁ డగుచున్ = ఉల్లము గలవాఁ డగుచును, సంగీత = పాటచేతను, సాహిత్య = చదువుచేతను, నిత్య = నిశ్చల మగు, సరస = తెలివరులతోడనగు, గోష్ఠీ = కూటువయందైన, వినోదైక = వేడుకయొకటనే, నిరతుఁ డగుచున్ = ఇచ్ఛ కలవాఁ డగుచును. కర్తృక్రియలు పైపద్యమున.

క.

వడిగలతనాన నీవిని
విడిముడిపసఁ బ్రాభవమున విజయనగరిలోఁ
గడు నెన్న నేర్చఁ గలమే
ల్నడకలఁ బెదవేంకటాద్రినరవరుఁ డొప్పున్.

37

టీక. వడిగలతనానన్ = శౌర్యముచేతను, ఈవిని = త్యాగముచేతను, విడిముడిపసన్ = ధనసంపత్తిచేతను, ప్రాభవమున = ప్రభుత్వముచేతను, విజయనగరిలోన్ = విజయనగరములో, కడు = మిక్కిలి, ఎన్నన్ = గణించుటకును, ఏర్చన్ = ఇవి యని యేర్ప