Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒకప్రబంధనిర్మాణముచేత, ఆహా = ఔరా - ఆశ్చర్యవాచకము, ఘటియింపఁగాన్ = కూర్చుటకు, వశమె = శక్యమా - రాఘవభారతార్థములు రెండు కలిగి యుండునట్లుగా నొకకావ్యము నిర్మింపఁ గూడునా యనుట, అట్లైనను, తావక = నీదగు, శ్లాఘనపూర్వక = పొగడుకోలు మున్నుగాఁ గల, ఉక్తి = మాట, అవిలంఘ్యము = దాఁటఁ దగనిది, కావునన్ = ఆకారణముచేత, కోవిద = విద్వాంసులయొక్క, అనుకంపా = కరుణచేత, ఘన = అతిశయముం బొందిన, బుద్ధిన్ = మతిచేత - పండితోత్తముల కృపాతిశయమువలన నాబుద్ధికి నిట్టిమహాకావ్యనిర్మాణమునందుఁ జూడ్కి కలిగెంగాని మఱియొకటిఁ గాదనుట, చమత్కృతిమత్ = చమత్కారము గల, కృతిన్ = ప్రబంధరచనయందు, మత్కృతిత్వమున్ = నాకౌశలమును, చూపెదన్ = కనుపఱిచెదను.

వ.

అని మఱియు నతనిచేత ననేకవిధసత్కారసంభావనాసంభృతసమ్మదుండ నై.

16

అని = ఇట్లని, మఱియును, అతనిచేతన్ = ఆ పెదవేంకటాద్రిప్రభువుచేత, అనేకవిధ = నానాప్రకారములయిన, సత్కారసంభావనా = దానసమ్మానములచేత, సంభృత = వహింపఁబడిన, సమ్మదుండనై = సంతోషము గలవాఁడనై.

సీ.

ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష
             యొక్కొకచోట నొక్కొక్కచోట
నుచితశబ్దశ్లేష యొక్కొక్కచోట న
             ర్థశ్లేష యొక్కొక్కతఱిని ముఖ్య
గౌణవృత్తిశ్లేషఘటన యొక్కొకతఱి
             నర్థాన్వయము వేఱెయగుచు నునికి
శబ్దాన్వయనిభేదసంగతి యొక్కొక్క
             తఱి నివి యొక్కొక్కతఱిని రెండు


తే.

మూఁడు గూడుట యన సముజ్జ్వలము గాఁగ
నాకుఁ దోచినగతిఁ బెక్కుఁబోక లమర
రామభారతకథలు పర్యాయదృష్టి
జూచుసుమతుల కేర్పడ నాచరింతు.

17

టీక. ఒక్కొకచోటన్ = ఒక్కొకయెడ, ఆంధ్రభాషాసంస్కృతాభిభాషాశ్లేష = ఆంధ్రగీర్వాణములయొక్కకూడికలు, ఒక్కొక్కచోట, ఉచిత = తగిన, శబ్దశ్లేషణ = శబ్దములకూడికయు, ఒక్కొక్కచోటన్, అర్థశ్లేష = అర్థములకూడికయు, ఒక్కొకతఱిన్ = ఒక్కొకవేళ, ముఖ్యగౌణ = ప్రధానాప్రధానములయిన, వృత్తి = ప్రవృత్తులు