| బ్రహ్మచర్యస్థితి భజియింపఁ బరమతా | |
ఆ. | జరిపె దనుచుఁ దిరిగి తిరిగి పైకొనుకోర్కి | 74 |
రామ. జ్యేష్ఠునితోడి సౌభ్రాత్ర మందలి సుస్థితిగలవాఁడు లక్ష్మణుఁడు పల్కెను, బ్రహ్మచర్యస్థితి గలవాని నను భజియింప వచ్చితివి, తాపముతోడ, సనాథ = కూడిన,సతీ = భార్యయొక్క, ఆజ్ఞయొక్క పసచే, పనిచిన నాయగ్రజునియొక్క యోగము, రాముని నూల్కొలుపుచును, రాముఁడును, అట్ల మునుపటివలెనే, పలుకఁగా, ఎందాఁక గుట్టు, జరిపెదు = జరిపెదవు, అనుచు, తిరిగి తిరిగి = రామునివద్దికిని లక్ష్మణునివద్దికిని దిరిగి తిరిగి, మదవంతుఁడైన, ఆసమవిశిఖ =మన్మథునిచేత, దళితహృదయ యగుచు, అతనినతనిన్ = రాముని లక్ష్మణుని, తెలచి = తెల్చి.
భారత. లక్ష్మణుఁడు = లక్ష్మీవంతుఁడైన యర్జునుఁడు, “లక్ష్మీవాన్లక్ష్మణఃశ్రీలః" అని అ. పల్కెను, నన్నరయక యిటు, వచ్చితి = వచ్చితివి, పరమతాపసనాథ = వ్యాసులయొక్క, ఆజ్ఞపసచేత, బ్రహ్మచర్యస్థితిని భజియింపఁబనిచిన, నాయగ్రజు = ధర్మజునియొక్క, నియోగమునని యన్వయము. బ్రహ్మచర్యమునఁ దపము చేయుమన్న పనుపు ననుట, వలపుపొలుపు = రాగాతిశయమును, గారాము = నెనరును, నూల్కొలుపుచున్ = ప్రకటించుచును, కదిసి = ఊర్వశి చేరి, తిరిగితిరిగి =మఱిమఱి, పైకొనుకోర్కిన్ = పైకొనెడికోరికచేత, అతనిమ = తనుత్వము లేని, దవత్ = దావాగ్నివలె నాచరింపుచున్న, అసమవిశిఖ, అతనిన్ = అర్జునుని, తెలచి యని యన్వయము.
సీ. | ఏమని చెప్ప నిం పెసఁగెడునునుఁబల్కు | |