రాముఁడు, ఉన్నచోటికి, కెళవునన్ = సమీపమున, ఆర్తిని బూనెను, అసురవనిత తాఁ గాన్ = తాను రాక్షసస్త్రీ గాఁబట్టి, కానుపించెను.
భారత. ఆసక్తిఁ దనరిన వాసవసేవ యనెడి, మిష = వ్యాజముచేతనైన, అనుభవ = సందర్శనముయొక్క, ఊర్వశీ తలోదరి = ఊర్వశి యనెడువనిత, పరిస్ఫీతకర = ఘనమునై, సకామ = మన్మథసహితమైన, సంభ్రమతన = సంభ్రమము గలది యౌటచేతఁ, ఒక్కతెయ = ఒకతెయే, హిమాంశువంశ = చంద్రవంశమునకు, ఆకల్పమైన = భూషణమైన, “ఆకల్పవేషౌ నైపథ్య” మ్మని అ. రాకుమారుఁ డున్నచోటికిన్ = అర్జునునివద్దికి, తమిన్ = రాత్రియందు, “రజనీయామిసితమీ” అని అ. ఏతెంచి ఆసురవనిత = ఆయప్సరస, కానయోగ్యమైన = వర్ణనీయమైన, కాంత = ఒప్పుచున్న, ఆకృతి వహించి, కనుపించెన్ = వచ్చెననుట.
వ. | ఇట్లు గానుపించి పరస్పరసందర్శనసమయసముచితసంభాషణంబులు | 72 |
రెంటికిని సరి.
తే. | తనకుదారయోగితకల్మితగఁ దెలుపుచు | 73 |
భారత. ఉదారమైన, యోగిత = యోగిత్వముయొక్క, కల్మిని దెలుపుచును, మదను = మన్మథునియొక్క, జవ = వేగముచేత, శకలిత = భేదింపఁబడిన, నిజమతిగలదాని, ఆచతురగామినిన్ = ఊర్వశిని, ప్రబలుమనసుచేత, ఆనలేక = తాళలేక, తన్గదియరాఁగా మానుపుచును, ఆచతురగామినిన్, పల్కెనని ముందరిపద్యమునఁ గ్రియ.
రామ. తనకు, దారయోగితకల్మి = భార్యాసంగతి కలుగుటను, తెలుపుచును, మత్ = నాయొక్క, అనుజ = తమ్ముఁడైన, లక్ష్మణునికి, వశకలిత = ఆధీనముగాఁ జేయఁబడిన, నిజమతిచేత, లక్ష్మణునిఁ గోరి యనుట, ప్రబలు మనఁగా, సుచేతనా = మంచిబుద్ధిచేత, “ప్రతిపద్ జ్ఞప్తిచేతనా” అని అ. చతుర, కామిన్ = కాకుండుటచేత, చతురగామి ననుదిక్కున సంధికి లక్షణము. "క. ప్రథమాంతవిభక్తులపైఁ, గథితములగుకచటతపలు గసడదవ లగు" నని యనంతునిఛందము. నాన లేక కదియరాఁగా, లక్ష్మణుఁడు పల్కెనని ముందరిపద్యములోఁ గర్తయుఁ గ్రియయు.
సీ. | జ్యేష్ఠసౌభ్రాత్రసుస్థితిలక్ష్మణుఁడు పల్కె | |