Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామ. ఆత్మపురః = తనుముందరనగు, స్థితిని, వారలు = ఆఋషీశ్వరులు, కడమ సులభము.

క.

అందు సమందశుభోదయ
మొందఁగనిబిడౌజుఁ డలరుచుండె సుమిత్రా
నందనజనకసుతానిశ
సందర్శితనవనవోల్లసద్భజనరతిన్.

70

రామ. అందున్ = ఆవనమందు, నిబిడ = సాంద్రమైన, ఓజుఁడు = తేజస్సు గల రాముఁడు, కడమ సులభము.

భారత. అందున్ = ఆస్వర్గమందు, కని, బిడౌజుఁడు = ఇంద్రుఁడు, "బిడౌజాః పాకశాసనః " అని అ. సుమిత్ర = సన్మిత్రులకు, ఆనందనజనక = ఆనందకరుఁడైన, సుత = కుమారుఁడైన యర్జునునిచేత, అనిశ = ఎల్లప్పుడు, సందర్శితమైన భజనరతిచేత నలరుచుండెను.

సీ.

ఆసక్తిఁ దనరిన వాసవసేవామి
            షానుభవనిరంతరానువృత్తి
నడఁగక పేర్చుపేరాసఁ గుందెడియుర్వ
            శీతలోదరిపరిస్ఫీతతరస
కామసంభ్రమత నొక్కతె యహిమాంశువం
            శాకల్ప మైనయారాకుమారుఁ
డున్నచోటికిఁ దమి నొక్కనాఁ డేతెంచి
            కెళవున నుండి యాకృతివిలాస


తే.

మరసి చూచి విశృంఖలస్మరశరార్తిఁ
బూనె నాసురవనిత దాఁ గాన యోగ్య
మైన కాంతాకృతి వహించి కానుపించె
సిగ్గుఁ జిఱునవ్వుఁ జూడ్కులఁ జెన్ను మీఱ.

71

రామ. ఆసక్తిఁ దనరి, నవమైన, ఆసవసేవా = మద్యపానముయొక్కయు, ఆమిషానుభవ = మాంసభక్షణముయొక్కయు, “పలలం క్రవ్యమామిష” మ్మని అ. నిరంతరానువృత్తిచేత, పేరాసన్ = అధికాశచేత, ఉరు-అశీతలోదరి = గొప్పయునై చల్లగాని కడుపు గలది, తనియనిది యనుట, ఒక్కతె = ఒకరాక్షసి, పరిస్ఫీత = సమగ్రమైన, తరస = మాంసమందుఁగల, కామ = కోరికయొక్క, సంభ్రమతన్ = త్వరచేత, అహిమాంశు = సూర్యునియొక్క, వంశమునకు, ఆకల్పమైన = అలంకారమైన, రాజకుమారుఁడు =