Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లాడఁగా ననుట, ఈరాట్కులాభరణంబు = ఈయర్జునుఁడు, ఇందునె = ఈబాణములేమిచేతనే, కడమ సులభము.

క.

తనకును శరభంగమునీ
శునకు సమరసత్వభరము సొరిది నొదువుచుం
దనరుట గడు నెన్నికలం
గని ప్రబలధృతిం దనర్చు క్షత్త్రియుఁ డంతన్.

48

భారత. క్షత్త్రియుఁడు = అర్జునుఁడు, తనకు, శరభంగము = బాణములు లేకపోవుటయు, ఈశునకు సమరసత్వభరము, ఎన్ని, కలంగని = చలింపని.

రామ. తనకును, శరభంగమునీశునకును, సమ = సమానమైన, రసత్వభరము = అనురాగాతిశయము, ఎన్నికలన్ = కొనియాడుటలచే, బలధృతిన్ = అధికసంతోషముచేత, క్షత్త్రియుఁడు = రాముఁడు.

సీ.

అతిదృఢం బైనట్టి యాత్మసఖ్యాతిచా
            పలత యెంతయుఁ దనబలిమిఁ ద్రిప్పి
ఘనతేజు నమ్మహాత్ముని నీకు నలబ్రహ్మ
            కట్టడ యె ట్లట్ల కాక దాఁట
నగునె పొ మ్మనుచుఁ దా ననిపెనుగడఁక మొ
            త్తంబై నిలింపసంఘంబు విరులు
గురిసె నప్పుడు నిజస్థిరచండహేతిపా
            తమునవికారలేశముఁ బొరయక


తే.

మెఱయు నారణ్యకేంద్రుపై మెచ్చుదనర
నర్హగతివిధిఁ జేరంగ నరిగె నాస
మిద్ధశౌర్యుఁడు శుభమౌనియుద్ధవశత
ఘనపదవి నెల్లఖచరులు వినుతి సేయ.

49

రామ. ఆత్మ = తనయొక్క, సఖ్య = చెలిమియందుఁగల, అతిచాపలత = అత్యంతచపలత్వమును, త్రిప్పి = మరలించి, రాముఁ డనెడుమాట, అమ్మహాత్మునిన్ = శరభంగుని, నీకు, బ్రహ్మకట్టడ = బ్రహ్మదేవునియాజ్ఞ, అనుచు ననిపెను, నిజ = స్వకీయమైన, స్థిర = నిత్యకృత్యమైన, చండ, హేతి = అగ్నిహోత్రునియం దగు, ఔపాసనాగ్నియందలి యనుట, పాతమునన్ = ప్రవేశించుటచేత, మెఱయు, అరణ్యకేంద్రుపైన్ = మునిశ్రేష్ఠుఁడైన శరభంగునిమీఁద, నిలింపసంఘంబు, అర్హగతిన్ = తగినక్రమముచేత, విధిన్= బ్రహ్మదేవుని, చేరంగన్ = చేరుచుండఁగా, విరులు గురిసెనని క్రిందటి కన్వయము. ఆసమిద్ధశౌర్యుఁడు = ప్రదీప్తమైన శౌర్యముగల రాముఁడును, శుభ, మౌని =