Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శరభంగునియొక్క, ఉద్ధవ = సంతోషములయొక్క, శతములచేత ఘనమైన పదవిని ఎల్లఖచరులు వినుతి సేయఁగా నరిగెనని యన్వయము. ఫలితార్ధము రాముఁడు శరభంగునికి ముక్తికి ననుమతించి యాముని దివ్యపుష్పవర్షములతో బ్రహ్మలోకమునకుఁ బోవుచుండఁగాఁ దాను సుతీక్ష్ణునియాశ్రమమునకు సాఁగివచ్చె ననుట.

భారత. ఆత్మ = తనయొక్క, సఖ్యాతి = ఖ్యాతితోఁ గూడిన, చాపలత = ధనుర్లతను గాండీవమును, తనబలిమిచేత, త్రిప్పి = విసరి, అమ్మహాత్మునిన్ = ఈశ్వరుని, నీకు, బ్రహ్మకట్టడ = బ్రహ్మవ్రాఁత, దాఁటనగునె పొమ్మనుచున్ = ఈపెట్టు దగిలించుకొని యణఁగునట్టుగా నీవ్రాఁత యుండెననుచు, తాను = అర్జునుఁడు, అని పెనుగడఁకన్ = యుద్దమందలి యధికరోషముచేత, మొత్తన్ = కొట్టఁగా, పైన్ = అర్జునునిపై, నిలింపసంఘంబు విరులు గురిసెను, నిజస్థిరచండహేతి = గాండీవముయొక్క, 'రవేరర్చిశ్చ శస్త్రంచ వహ్నిజ్వాలాచ హేతయః' అని అ. పాతమునన్ = పెట్టుటచేత, మెఱయుచున్న, ఆరణ్యకేంద్రుపైన్ = కిరాతరూపమున నున్నయీశ్వరునిమీఁద, మెచ్చు దనరఁగా, అర్హగతివిధిన్ = సమయోచితగతి విధానముచేత - వేగిరముగా ననుట, ఆసమిద్ధశౌర్యుఁడు = అర్జునుఁడు, శుభమౌ = శుభ మగునట్టి, నియుద్ధవశతన్ = బాహుయుద్ధపరతచేత, “నియుద్ధం బాహుయుద్ధే స్యా” త్తని అ. ఘనపదవిన్ = ఆకాశమార్గమున, ఎల్ల, ఖచరులు = దేవతలు, వినుతి సేయఁగాఁ జేరంగ నరిగెను.

వ.

అంత.

50


శా.

మాయామర్త్యుఁడుమాధవుం డవిచలన్మైత్రిన్ సుతీక్ష్ణాశ్రమ
స్ఫాయత్సత్త్వవిహారమప్రవిశదీషద్వేషరోషాంకురం
బై యేపారఁగఁ జూచుచుం బరువడిన్ హర్షదయం బెక్కఁగా
జాయం దమ్ము నిరూఢదృష్టిఁ గన భ్రూసంజ్ఞన్ నియోగించుచున్.

51

భారత. ఉమాధవుండు, అవిచలత్ = చలింపని, మైత్రి = అర్జునునిమీఁది మైత్రిచేత, సుతీక్ష్ణమై, అశ్రమ = శ్రమరహితమై, స్ఫాయత్ = పెరుఁగుచున్న, సత్త్వ = బలిమియొక్క, విహారము = పెనఁగులాట యనుట, అప్రవిశత్ = ప్రవేశింపని, ఈషద్ద్వేషరోషాంకురములు గలదై, పరు-వడిన్ = అర్జునునియొక్క వడిచేత, జాయన్ = పార్వతిని, తమ్మున్ = అర్జునుని దన్నును, నిరూఢదృష్టిన్ = సావధానదృష్టిచేత, కనన్ = చూచునట్టుగా, నియోగించుచును.

రామ. మాయామర్త్యుఁడైన మాధవుండు = రాముఁడు, సుతీక్ష్ణాశ్రమమందు, స్ఫాయత్ = వృద్ధిఁ బొందుచున్న, సత్త్వ = జంతువులయొక్క, విహారము, మైత్రి చేతన ప్రవిశదీషద్ద్వేషరోపాంకురంబై యేపారఁగా, జాయన్ = సీతను, తమ్మునిన్ = లక్ష్మణుని, రూఢ, కడమ సులభము.