Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రదీప్తమైన, సపర్యాయ= పర్యాయముతోఁ గూడిన, తిరోహితభావు లగుచున్ = తిరోహితత్వము గలవారై - ఓటమిగలవా రౌచుననుట, ధృతి = ధైర్యమును, నెరపుచును, ధర్మపటిమ = వింటినేర్పుయొక్క, దృఢత = దార్ఢ్యమును, నెరపుచును.

రామ. నుత, సత్త్వ = సత్త్వగుణమునకు, అధికరణ = స్థానమైనదియునై, లసత్ = ఒప్పుచున్న, ఇతరేతరజాతి = అన్యోన్యబ్రహ్మక్షత్త్రజాతులకు, ఉచిత = తగిన, సమిద్ధమైన, సవర్యా = పూజలయొక్క, “సవర్యా తర్పణం బలిః" అని అ. ఆయతి = నిడివియందు, రోహిత = మొలిపింపఁబడ్డ, భావ = తాత్పర్యము గలవారౌచును, ధృతి = సంతోషమును, “ధృతిర్యోగాంతరే ధైర్యే ధారణాధ్వరతుష్టిషు” అని అ. ధర్మపటిమ = ధర్మాతిశయముయొక్క.

వ.

ప్రవర్తిల్లి రయ్యవసరంబున.

46


మ.

అరుదార న్నరభావవిస్ఫురితశౌర్యాలోకఖేలన్మనో
హరమాహాత్మ్యము మీఱ లుబ్ధకరణవ్యావర్తనాశక్తిని
ర్భరుఁ డై తాపసుఁ డంపలేమిఁ బ్రకటింపం జూచి యీరాట్కులా
భరణం బిందునె చిక్కునో యని నిలింపవ్రాత మెంచె న్మదిన్.

47

రామ. అరుదారన్ = అరుదగునట్టుగా, నరభావ = మనుష్యత్వముచేత, విస్ఫురితుఁడైన, శౌరి = విష్ణువైన రామునియొక్క, ఆలోక = సందర్శనమనెడి, ఖేలన్ = క్రీడచేత, మనోహరమైన మాహాత్మ్యము మీఱఁగా, భావము. విష్ణుసందర్శనమువల్లఁ దపోమహత్త్వము ప్రకాశింపఁగా ననుట, లుబ్ధ = ఎడఁబాయఁజాలని, కరణ = ఇంద్రియముయొక్క, లోభముయొక్క యనుట. “కరణం సాధకతమక్షేత్ర గాత్రేంద్రియేష్వపి” అని అ. వ్యావర్తన = త్రిప్పుటయందుఁ గల, అశక్తిచేత నిర్భరుఁడై, అశక్తి యధికమనుట, తాపసుఁడు = శరభంగుఁడు, అంపలేమిన్ = అంపలేకుండుటను, ఈరాట్కులాభరణంబు = ఈరామచంద్రుఁడు, ఇందునె = ఈయాశ్రమమందే, చిక్కునో = రాక్షససంహారము చేయక నిలుచునో, అని = ఇట్లని, నిలింపవ్రాతము = దేవతాసమూహము, ఎంచెను.

భారత. నర = అర్జునునియొక్క, భావమందు విస్ఫురితమైన శౌర్యముయొక్క, ఆలోక = పరీక్షయందు, ఖేలత్ = విహరింపుచున్న, మనః = మనస్సుగల, హరునియొక్క, మాహాత్మ్యము = జయము, మీఱఁగా, లుబ్ధక = కిరాతరూపమైనహరునియొక్క, “మృగయుర్లుబ్ధకశ్చ సః" అని అ. రణ = యుద్ధమును, వ్యావర్తన = మాన్చుటయందుఁ గల, అశక్తి = శక్తిరాహిత్యముచేత, నిర్భరుఁడై = అతిశయము లేనివాఁడై, “భరోతి శయభారయోః” అని వి. తాపసుఁడు = అర్జునుఁడు, అంపలేమిన్ = అమ్ములయొక్కలేమిని, ప్రకటింప = ప్రకాశము చేయఁగా, అమ్ములు పొదులలోఁ గానక వెదుకు