Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భంగరాములు సంధింపఁగా, సత్ఫలతన్ = లెస్సఫలము గలవౌట చేత, ఒప్పెడి, అంబకములు = కన్నులు, ఏసిరి = ఏయొప్పిదమును, వహించెను. అది = ఆయొప్పిదము, తదుభయ = ఆయిద్దరియొక్క, సంగమందు రాగముగల, మనః = మనస్సుచేత, ఆర్జిత = సంపాదింపఁబడ్డ, ఉత్సవధురా = ఉత్సవాతిశయమునకు, “ఋక్పూరబ్ధూఃపథామానక్షే” అనుసూత్రమున టచ్ప్రత్యయాంతము. నిమిత్తతన్ = సూచక మగుటచేత, తత్ = ఆశరభంగరాములయొక్క, అన్యోన్యజన్య = ఒకరొకరివలనఁ బుట్టిన, ముత్ = సంతోషముచేత, ద్యోతి యగుచున్ = ప్రకాశింపుచున్నదై, అది యొప్పిదము మించెనని యన్వయము. ఇందుకు భావము శరభంగుడు రాముఁడును గూడఁగాఁ గన్నులవికాస మేది కలదో యావికాసము వారిమనస్సులయందలి యుత్సవమును సంతోషమును దెలిపె ననుట.

భారత. అని = యుద్ధమందుఁ గల, కోర్కి మీఱఁగా, నిజాలోకపరులు, అతీత = విడువఁబడిన, ఆశ్రమములు నాలయములు గలవారు, మునులు, అనుసరింప, భూదార = వరాహముయొక్క, “ క్రోడోభూదారఇత్యపి" అని అ. అనుయాన = వెంటఁ బోవుటకు, ఉచితమౌనట్టుగా, అధ్వని = ధ్వని లేకుండునట్టుగా, క్షిప్త= పెట్టఁబడిన, అంఘ్రిగతులచేత, అవని = భూమి, చెన్ను మీఱఁగా, ఆత్మభక్తుని = అర్జునునియొక్క, సత్త్వము = బలమును, ఆరసి = పరీక్షించి, ప్రోచుటకు, రాజనతంసుడు = చంద్రశేఖరుఁడు, వీగి, ఆవనక్రోడంబునందు = అడవిపందియందు, ఆతపస్వియుఁ దానును = అర్జునుండును దానును, కూడ, సత్ఫలక = మంచిముల్లులు గలవౌటచేత, “సస్యబాణాగ్రయోః ఫల” మ్మని రత్నమాల. ఒప్పు, అంబకములు = బాణములను, ఏసిరి, అది = ఆయేయుట, తదుభయ = ఆయిద్దఱియొక్క, సంగర = యుద్ధముయొక్క, ఆగమనమనెడి, ఉత్సవధురా = ఉత్సవాతిశయమునకు, నిమిత్తతన్ = కారణత్వమును, వహించెనని క్రిందటి కన్వయము. తత్ = ఆకిరాతార్జునులయొక్క, అన్యోన్యజన్యము = పరస్పరయుద్ధము, “యుద్ధమాయోధనం జన్య” మ్మని అ. ఉద్యోతియగుచున్ = ప్రకాశింపుచున్నదై, నుతి గాంచి మించెనని క్రిందటి కన్వయము.

వ.

వారలిద్దఱు గొంతతడవు.

44


క.

నుతసత్త్వాధికరణలస
దితరేతరజాత్యుచితసమిద్ధసపర్యా
యతిరోహితభావు లగుచు
ధృతి నెరపుచు ధర్మపటిమ దృఢత నెరపుచున్.

45

భారత· నుతసత్త్వ = వర్ణనీయబలముగల, అధికరణ = ఘనయుద్ధముచేత, లసత్ = ఒప్పుచున్న, ఇతరేతరజ = ఒకరొకరివలనఁ బుట్టిన, అత్యుచితమానట్టుగా, సమిద్ధ =