Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పుష్కరాక్షసునని క్రిందటి కన్వయము, ఉమావిభుండు = ఈశ్వరుఁడు, దమ = అణఁచుటయందుఁ గల, ఆదరంబున వెనుదౌలెను, రాక్షసున్ తరసవిశేష, అంగరాజకున్ చరకుధర, అనెడిదిక్కుల సంధిలక్షణము. క. 'నాంతము లైనపదంబుల, పొంతం బై నున్నశబ్దములకచటతప, ల్దొంతి గజడదబ లగున, య్యంత నకారంబు నున్న యభినవదండీ' యని యాంధ్రభాషాభూషణము.

రామ. దేవరిపుభీమ, వరాహవ = లెస్సయుద్ధము గలవాఁడా, “సంగ్రామాభ్యాగ మాహవాః” అని అ. పుష్కరాక్ష = రాజీవాక్ష, "బిసప్రసూనరాజీవపుష్కరాంభోరుహాణి చ" అని అ. సుందరమునై, సవిశేషధామ = విశేషతేజస్సహితమునై, సముదంచిత = పూజితమునై, సత్త్వమయ = సాత్త్వికగుణప్రధానమునైన, అంగము గలవాఁడా, రాజకుంజర = రాజశ్రేష్ఠుఁడా, "సింహశార్దూలనాగాద్యాః పుంసి శ్రేష్ఠార్థగోచరాః” అని అ. ఇవి సంబుద్ధులు. ప్రబలు = ప్రబలెడి, సర్వ, పలాశిచయంబు = రాక్షససమూహమును, నిను, మావిభుండు = మాధవుఁడు, అను = అనెడి, మతిన్ = మతిచేత, వెనుతౌలెదము.

సీ.

అని కోర్కి మీఱ నిజాలోకపరు లతీ
            తాశ్రమాలయులు దన్ననుసరింప
నవనిభూదారానుయానోచితాధ్వని
            క్షిప్తాంఘ్రిగతులను జెన్ను మిగుల
నాత్మభక్తునిసత్త్వ మరసి ప్రోచుటకు రా
            జవతంసుఁ డట్లు వత్సలత నేఁగి
యావనక్రో డంబు నం దాతపస్వియుఁ
            దానును గూడ సత్ఫలత నొప్పు


తే.

నంబకము లేసిరి వహించె నది తదుభయ
సంగరాగమనోర్జితోత్సవధురాని
మిత్తతఁ గరంబు నుతి గాంచి మించె నప్పు
డొగిఁ దదన్యోన్యజన్యముద్ద్యోతి యగుచు.

43

రామ. అని = ఇటని, అవనిభూ = సీతయొక్క, ఉదారమైన, అనుయాన = కూడ వచ్చుటకు, ఉచిత మగునట్టుగా, అధ్వ = మార్గమందు, నిక్షిప్త = పెట్టఁబడిన, అంఘ్రి = పాదములయొక్క, గతులచేతఁ జెన్ను మిగులునట్టుగా, ఆత్మభక్తుని = శరభంగునియొక్క, సత్త్వము = సత్త్వగుణమును, ఆవనక్రోడంబునందున్ = వనమధ్యమం దనుట. "క్రోడస్సూకరపాతంగ్యోః క్రోడః క్రోడం చ వక్షసి” అని అ. ఆతపస్వియు దానును గూడన్ = శర