వనలక్ష్మిన్ = శరభంగాశ్రమవిలాసమును, ధరాత్మజకు =సీతకు, చూపియఁఁ జెప్పియు వేడ్క సేయుచును, అచ్చటికి, చనియెనని క్రియ.
| చ. | వలసినవన్యవర్తన మవాక్యగతిన్ జరిగింపుచుం బ్రవ | |
రామ. వన్యవర్తనము = కందమూలఫలాదికమును, జరిగింపుచున్ = ఆహారము చేసికొంచును, ప్రవర్ధిలుతమిన్ = అధికారముచేత, పేర్చు = ఒప్పునట్టి, తమ్ముని = లక్ష్మణునియొక్క, అతిస్థిర, భక్తిన్, = భక్తిచేత, ప్రమోదసంపద ల్తలకొనఁగా, అరణ్యచరతన్ = వనసంచారమును, భజియించి = చేకొని, అతండు = ఆరాముఁడు, ముఖ్యభృత్యులు = ఆత్మసేవకులైన, అమరసంయముల్ = దేవమునులు, మది మ్రొక్కన్ = మనస్సులయందే మ్రొక్కఁగా, మనుష్యావతారుఁడై యున్నాఁడు గనుక, మర్త్యతను నటించెను.
భారత. వలసిన, వన్యవర్తనము = వనవిహారమును, తమ్మును, అరణ్యచరతన్ = కిరాతత్వమును, భజియించియ = పొందినవారయ్యే, తండుముఖ్యభృత్యులు = నందిప్రముఖసేవకులును, “తండునందినౌ నందికేశ్వరే” అని అ. అమరఁగా, సంయముల్ = మునులు, ముదముతో మదిన్ = సంతోషముతోఁ గూడిన మనస్సుచేత, మ్రొక్క, మర్త్యతన్ = మనుష్యరూపమున, నటించెన్ = వర్తించెను.
| వ. | అది య ట్లుండె నట్టిసమయంబున. | 41 |
| చ. | బిరుదునఁ బేర్చు దేవరిపుభీమవరాహవపుష్కరాక్షసుం | 42 |
భారత. దేవ = దేవతలకు, రిపు = శత్రుఁడైనవాని, భీమ = భయంకరమైన, వరాహవపుష్క = సూకరాకారము గలిగిన, రాక్షసున్ = మూకాసురు ననుట, తరస = మాంసముయొక్క, “పిశితం తరసం మాంస” మ్మని అ. విశేష = భేదమునకు - క్రొవ్వున కనుట, ధామ = స్థానమైన, సముదంచిత = ప్రకాశింపుచున్న, సత్త్వమయ = బలప్రచురమైన, ప్రాచుర్యమున మయట్టు, అంగరాజకున్ = శరీరశ్రేష్ఠము గలవాని, చర = చరించెడి, కుధరాకృతిన్ = పర్వతాకారముచేత, ప్రబలెడువాని, సర్వ, పలాశిచయంబు = వృక్షసమూహమును, “పలాశీద్రుద్రుమాగమాః” అని అ. కూల్చు సుస్థిరుని, వరాహవ