దాని, అధికమైన, శివమనురూప = శివమంత్రరూపమైన, సన్నిధి = లెస్సైననిధానమును, పెన్నిధివంటి పంచాక్షరి ననుట, ఒసంగన్ = ఇచ్చినను, అతనిన్ = ఇంద్రుని, అంచి = అంపి, కృత =చేయఁబడ్డ, అర్థ = శివారాధనరూపప్రయోజనము గలవాఁడను, అగుదు ననుచు, ఇంద్రుఁడు శివమంత్రోపదేశము చేసినతర్వాత నర్జునుఁ డీప్రకారమున, జింతించెను.
రామ. ప్రీతి వచ్చి = సంతోషము వచ్చి, నాకు, ఈశుఁడు = రాముఁడు, అధికశివము = అతిశుభమైన, అనురూపసన్నిధి = నాకుఁ దగినసాన్నిధ్యమును, ఒసంగన్ = కృప చేసినతర్వాత, అతనినంచి ఆరఘునాథుని నంపినవాఁడనై, కృతార్థుండ నగుదున్ = అలాగె బ్రహ్మలోకమునకు వచ్చెద ననుచు.
వ. | యథోచితవినయోపచారపూర్వకంబుగా నింద్రుని మగుడ ననిచి. | 37 |
క. | తనమనమున నెంతయు మిం | 38 |
రామ. రాజశేఖరున్ = రాజశ్రేష్ఠుఁడైనవాని, రఘునాథునిఁ దలఁచుచు, భూయః = మఱియు.
భారత. రాజశేఖరున్ = ఈశ్వరుని, నిరఘున్ = నిష్కల్మషమైనవాని; నాథుని దలఁచుచు, భూయః = తఱుచైన, తపస్సమాధిని దలిర్చెను.
చ. | అతఁడును దత్తపోమహిమ యచ్చటిమౌనులు వచ్చి చెప్పఁగా | 39 |
భారత. అతఁడును = ఈశ్వరుఁడును, తత్ = ఆయర్జునునియొక్క, తపోమహిమను, అచ్చటికిన్ = అర్జునాశ్రమసమీపమునకు, పర = పరులచేత, అజిత = నివారింపఁబడని, ఉద్ధతి = ఔద్ధత్యముచేత, విలసత్ = ఒప్పుచున్న, వయః = ప్రాయము గల, మృగయుతన్ = కిరాతత్వముచేత, “మృగయు ర్థుబ్దకశ్చసః" అని అ. వనలక్ష్మిని, ధరాత్మజకున్ = పార్వతికి, “ఆహార్యధరపర్వతాః” అని అ. చూపియఁఁ జెప్పియు వేడ్క సేయుచును, చనియెనని క్రియ.
రామ. అతఁడును = ఆరాముఁడును, పరాజిత = తిరస్కరింపఁబడిన - లేనిదనుట, ఉద్ధతి = ఔద్ధత్యము గల - వైరము గలవై యనుట, విలసత్ = ఒప్పెడి, వయః = పక్షులతోడను, “'ఖగబాల్యాదినోర్వయః” అని అ. మృగములతోడను, యుతన్ = కూడిన,