షాతిశయమునకు, ఆస్పదమును, నేత్రోత్సాహ మైనవాని ననుట. “అంబకం నేత్ర శరయోః” అని వి. ఆస్పదశబ్దము నిత్యనపుంసకము. ఘనమైన తపశ్శక్తి గలవాని - శరభంగమునీశ్వరుని, తెమ్మని = పిలుచుకరమ్మని, విధి = బ్రహ్మదేవుఁడు, జిష్ణున్ = ఇంద్రుని, పంచెన్ = అంపెను, తద్వేళ వచ్చి = తదుచితవేళ రాఁగా ననుట, సత్యవిధానుఁడు = తత్పితామహుఁడు, అట్లు-అంపన్ = ఆలాగు చెప్పి యంపఁగా, ఆఘనుఁడు = శరభంగుఁడు, అనుమాట, ఇంద్ర - సంబుద్ధి, కీల = అగ్నిజ్వాలయందుఁ గల, “ద్వయోర్జ్వాలకీలౌ” అని అ. ఆశ్రమప్రవేశ మొనరించి, అవ్విధిన్ = బ్రహ్మదేవుని, భజించెదను, యాత్వరాతి = రాక్షసవైరి, “యాతురక్షసి” అని అ. రాముఁడు వచ్చి, కరుణసేయునంతకున్ = నాకుఁ దనసేవ ననుగ్రహించుదనుక, గట్టితాల్మి తగున్ = విలంబమును వహింపఁదగు ననుట, ఇందుకు భావము రాముఁడు శరభంగాశ్రమమునకు వచ్చెడివేళ బ్రహ్మ యింద్రునిం బంపి శరభంగునిఁ బిలిపింపఁగా నాయన రాముని సేవించినవెనుక నగ్నిప్రవేశము చేసి బ్రహ్మసన్నిధికి వచ్చెననుట.
భారత. తత్ = ఆయెన్నికచేత, మహాశ్రమగ = అధికశ్రమమునుబొందిన, మనః = మనస్సుచేత, దితోత్సాహుఁ డయ్యెన్ = ఖండితోత్సాహుఁ డాయెను, ఆసమయంబునందు, అమితములైన, తుంగహృత్ = ఉన్నతచిత్తులైన, రిపు = శత్రులయొక్క, శరములను, అమితపదము శరవిశేషణము, భంగము = భంగించెడిదాని, ఈశ్వరునంబకమున్ = పాశుపతాస్త్రమును, మహిమకు, ఆస్పదమైనదాని, మనతపశ్శక్తిచేత, విధి దయచేసి = మంత్రవిధానము నుపదేశించి, సత్యవిధానుఁడు = వ్యర్థముగాని శాసనము గలవాఁడు, తత్పితామహుఁడు = వ్యాసమునీశ్వరుఁడు, తద్వేళ వచ్చి = ఆధర్మరాజువిచారవేళయందు వచ్చి, జిష్ణున్ = అర్జునుని, పంచెనని క్రిందటి కన్వయము. అట్లంపన్ = ఆరీతి నంపఁగా, ఆఘనుఁడు = ఆయర్జునుఁడు, ఇంద్రకీలాద్రియందున్న యాశ్రమప్రవేశ మొనరించి, అవ్విధిన్ = ఆమంత్రవిధానముచేత, సురేశున్ = ఇంద్రుని, భజించెను. దయాత్వరా = కృపాతిశయముచేత, అతిరాముఁడు = మిక్కిలి నభిరాముఁడు, ఆదిత్యకులభర్త = దేవతాపతియైన యింద్రుఁడు, కరుణ సేయునంతకున్ = ప్రసన్న మగుపర్యంతము, తగు = తగిన, గట్టితాల్మిచేత, భజించెనని క్రిందటి కన్వయము.
తే. | ప్రీతి వచ్చి నాకీశుఁడు నాతపోవి | 36 |
భారత. ప్రీతి వచ్చి, నాకీశుఁడు = ఇంద్రుఁడు, ఆతపోవిభూతియొక్క ఫలమును, తాన్ = తాను, నైయత్యపూర్వ = నియతత్వపూర్వకమైన, వృత్తిన్ = వర్తనగల