Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పులు = విలాసములు, అమరన్ = అమరుటకు, సమయంబు = వేళ, ఇటు సేయు టొప్పగున్ = వందనము సేయునది మేలు.

వ.

మఱియు నొక్కనియమం బెఱింగించెద.

89


క.

విను రామ యొరుని శాంతం
బున సేవయొనర్చుకాలమున నెవ్వఁడు దాఁ
జను దండకార్యగతి నా
యన వర్షాచరితతీర్థయాత్రుఁడుగఁ దగున్.

90

రామ. రామ = సంబుద్ధి, శాంతంబునన్ = శాంతిచేత, "కర్తరిక్తః" సేవ యొనర్చుకాలమున, ఒరుని, దండకార్యగతిన్ = దండోపాయమున, ఎవ్వఁడు, చను = ప్రవర్తించును, ఆయన, వర్ష = వర్షాకాలమందు, ఆచరిత= చేయఁబడిన, తీర్థయాత్ర గలవాఁడు గాఁదగును. “వర్షాకాలే ప్రయాణ" మని యతిక్లేశము గనుక.

భారత. రామ = ద్రౌపది, ఒరు = ఒకరియొక్క, నిశాంతంబునన్ = గృహమందు, “నిశాంతవస్త్యసదన” మని అ. దండకున్ = సమీపమునకు, ఎవ్వఁడు దాఁ జనును, ఆయన, ఆర్యగతిన్ = సన్మార్గమున, వర్ష = సంవత్సర మెల్ల.

క.

అని శమదమహిమవర్తనుఁ
డనిపించుకొని చనియెను సహస్రకరుఁడు నా
యనలసమానౌజస్స్పృ
ష్టిని జిత్రపతంగలీలఁ జెందెఁ జనునెడన్.

91

భారత. అని = పూర్యోక్తప్రకారమునఁ జెప్పి, శమ = అంతరింద్రియనిగ్రహముచేతను, దమ = బహిరింద్రియనిగ్రహముచేతను, హిమ = చల్లనైన, “తుషారశ్శీతలశ్ళీతోహిమః" అని అ. వర్తనముగల నారదుఁడు, అనిపించుకొని = అంపించుకొని, చనియెను, చనునెడ = నారదుఁ డాకాశగమనమునఁ బోవునప్పుడు, సహస్రకరుఁడును = వేయికిరణములు గల సూర్యుఁడును, ఆయనయొక్క, లసమాన = ఒప్పుచున్న, ఓజస్స్పృష్టిని = తేజస్స్పర్శచేత, చిత్రపతంగ = చిత్తరువు సూర్యునియొక్క, "పతంగః పక్షి సూర్యయోః" అని అ. లీలఁ జెందెను.

రామ. అనిశ = ఎల్లప్పుడును, మదమహిమ = గర్వాతిశయముచేత నగు, వర్తనగలవాఁడు, అనిపించుకొని = ఖ్యాతి గని - ఎంచఁబడినవాఁడై యనుట, సహస్రకరుఁడు = కార్తవీర్యుఁడు, చనియెను = నొచ్చెను, నా = నాయొక్క, అనల = అగ్నికి, సమానమైన, ఓజ = తేజస్సుయొక్క, స్పృష్టి చేత, చనునెడన్ = నొచ్చునపుడు, చిత్ర = అద్భుతమైన, పతంగ = మిడుతయొక్క, “సమౌ పతంగశలభౌ” అని అ. లీలన్ = సామ్య