Jump to content

పుట:రాఘవపాండవీయము (పింగళి సూరన).pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవరుద్ధ = నిలుపఁబడిన - కల్పింపఁబడిన వనుట, యుద్ధము లశక్యవిజయములని యన్వయము.

రామ. నాభవు = నాగురువైన యీశ్వరునియొక్క, వరధర్మము = దొడ్డవిల్లు, అట్టగుట = విఱువఁబడుటను, ఆవరశక్తికి = ఆవిల్లు విఱిచిన సత్త్వమునకు, మత్ = నాచేత, ఈరిత = ప్రయోగింపఁబడిన, మహాశరమణి = మహాస్త్రశ్రేష్ఠములచేత, అవరుద్ధ = నిలుపఁబడ్డ - చేయఁబడ్డ వనుట.

క.

విను మంతపనులరాకకు
మునుపుఁగ దచ్ఛాంతిమార్గముం దెలిపెద నొం
డొనరింపుము సమయము ధరఁ
గొనసాఁగి తనర్చెద మనుకోర్కి గలిగినన్.

87

రామ. సమయము = నొవ్వము, ధరన్ = భూమియందు, కొనసాఁగి తనర్చెదము = ఉత్తరోత్తరముగా నుండెదము, అనుకోర్కి గలిగినను, ఒండు = ఒకటిని, ఒనరింపుమని క్రిందటి కన్వయము.

భారత. ఒండు =ఒకటైన, సమయము = సంకేతమును, ఒనరింపుము.

చ.

సమరసరూఢిమచ్చరితసాధ్వసమాకృతిఁ బర్వ రాజస
త్వమదనిరాసివక్త్రమగువం దనధర్మము పూని కొల్వు సే
యు మనుము నీకుఁ దమ్ములకు నొక్కనియొక్కనియింట నేఁడు పూ
ర్ణముగ వసించి సొంపు లమరన్ సమయం బిటు సేయు టొప్పగున్.

88

భారత. సమరసన్ = సమానరాగము గలదాని, రూఢిమచ్చరితను = ప్రసిద్ధిగలచరిత్రము గలదాని, సాధు = సుందరమునై, అసమ = సరి లేని ఆకృతి గలదాని, పర్వరాజ = పున్నమచందురునియొక్క, సత్వమద = చారుత్వగర్వమును, నిరాసివక్త్రన్ = తిరస్కరించెడు ముఖము గలదాని, మగువన్ = ద్రౌపదిని, తనధర్మము పూని = పతివ్రతాధర్మముఁ బూని, ఒక్కనియొక్కనియింటను, ఏఁడు = వత్సరము, పూర్ణముగ నమరఁ గొల్వు సేయుమనుము.

రామ. సమర = యుద్ధమందు, సరూఢి = ప్రసిద్ధితోఁ గూడిన, మత్ = నాయొక్క, చరిత = చరిత్రమువల్ల నైన, సాధ్వసము = భయము, ఆకృతిఁ బర్వ = ఆకారమునఁ గానరాగా, రాజసత్వ = రజోగుణముచేత నైన, మద = మదమును, నిరాసి = విడిచిన, వక్త్రమగు = ముఖము గల - ఆరంభము గలదైన యనుట. వందనధర్మముఁ బూని కొల్వు సేయుము, మనుము = బ్రతుకుము, నీకుఁ దమ్ములకు నొక్కనియొక్కనియింట, నేఁడు = ఈప్రొద్దు, నేఁ డని యర్ధబిందు వున్నందుకు, ఉ. 'వాఁడిమయూఖము ల్గలుగువాఁ డపరాంబుధిఁ గ్రుంకె ధేనువు, ల్నేఁ డిట వచ్చె' నని నన్నయభట్టు ప్రయోగము. సొం