ప్రణమిల్లుచుండఁగా ననుట, అమ్మహిప్రభునియొక్క, ఆనతి = ఆనమస్కారమును, కైకొని, నిలక = నిలువక, సేవాదులను జేకొనక యనుట, మహాచలేంద్ర = క్రౌంచపర్వతముయొక్క, ప్రస్థ = చరిపట్టుయొక్క, “ప్రస్థోస్త్రీ సానుమానయోః" అని అ. పుట = బంధనముయొక్క, భేదనమందు, ప్రభు = సమర్థమైన, వైశిఖ = విశిఖసంబంధమైన, ఉగ్రప్రతాపముతోడ, కలితుఁడు, ఉరుదండనీతి, భార్గవుఁడు, నిజభుజైకవశము లైన, ధరణిప = భూపతులయొక్క, అర్థాఢ్యుఁడు, అర్థప్రాణముగలవాఁడు, నవమైన, రజ = రజోగుణముయొక్క, స్థితిచేతను, బంధుర = సమర్థమైన, ఆజి = యుద్ధమందుఁగల, ఆవిరళరతిచేతను, పొదలి, అభిరామ = రాముని కెదురైన, వర్తనంబునఁ జెలంగెను.
| వ. | ఇట్లు ప్రవర్థిల్లుచుండ. | 77 |
| క. | సత్యైక్యముకతమున వీ | 78 |
రామ. సత్య = యథార్థమైన, ఐక్యముకతమునన్ = ఇద్దఱు నావిష్ణువునవతారము లైన నిమిత్తమున, వీరు రామభార్గవరాములు, నిర్విభేదు లయ్యును, అతనుమాయా = ఆధికమైన మాయచేత, త్యాజిత = విడిపింపఁబడిన, మైత్రి యొక్క సాతత్యతన్ = ఎడతెగమి గలవా రౌటచేత, పోరెదరొ యనుశంకను, కయ్యంబుల వేడుకకాఁడు వచ్చెనని ముందటిపద్యములోఁ గ్రియ.
భారత. సతీ = భార్యయొక్క ఐక్యముకతమున, వీరు = పాండవులు, నిర్విభేదు లయ్యున్ = బెరకు లేనివా రయ్యును, అతనుమాయా = మన్మథమాయచేత.
| క. | కయ్యంబులవేడుకకాఁ, డయ్యున్నతకలహకేళికాకాంక్షకుఁ డై | 79 |
భారత. కయ్యంబులవేడుకకాఁ డయ్యున్ = యుద్ధాపేక్ష గలవాఁడై యుండియు, నత = అణఁగినట్టి, కలహకేళికా = కలహక్రీడయందుల, ఆకాంక్ష గలవాఁడై, పాండపులమీఁదిదయచేఁ గలహకాంక్ష విడిచి యనుట, దివినుండి = స్వర్గముననుండి, వారిన్ = పాండవులను, అభిదర్శింప = చూచునిమిత్తమై, నారదుఁడు వచ్చెను.
రామ. కయ్యంబులవేడుకకాఁడు, అయ్యున్నతకలహకేళికి, ఆకాంక్షకుఁడై, వారిక్ = రామభార్గవులను, చూచెడి కొఱకు.
| వ. | అప్పుడు. | 80 |