రథుఁడు, తత్ = ఆరఘునాథునియొక్క, సమర = యుద్ధ మనెడి, ఆజ్యముయొక్క సమర్పణంబుఁ జేయుట, యనీతిగ నెంచెను.
భారత. భీమ = భీమునియొక్కయు, ధనంజయ = అర్జునునియొక్కయు, ఆత్మజు = దుర్యోధనునియొక్క, మహీధవుఁడు = ధృతరాష్ట్రుఁడు, తత్ = ఆధర్మజునకు, సమ, రాజ్యసమర్పణంబుఁ జేయుటయ, నీతిగ నెంచెను.
| సీ. | అ ట్లాత్మ నెంచినయర్ధరాజ్యమహిమ | |
| తే. | కలితుఁ డురుదండనీతిభార్గవుఁడు నిజభు | 76 |
భారత. అర్ధరాజ్యమహిమను, అమర్చి = ఇచ్చి యనుట, అనుపఁగా, మానసపర్యాప్తిన్ = మనఃపూర్తిని - సంతోషము ననుట, సప్రణతిగన్ = నమస్కారసహితముగా, అమ్మహిప్రభుని = ఆధృతరాష్ట్రునియొక్క, ఆనతి = వాక్యమును, కైకొని, ప్రథిత = ప్రసిద్ధమైన, మహ = ఉత్సవములచేత, “మహ ఉద్ధవ ఉత్సవః” అని అ. అచల = స్థిరమైన, ఇంద్రప్రస్థ మనెడి, పుటభేదన = పట్టణమునకు, “పట్టణం పుటభేదన” మని అ. ప్రభువై, శిఖా = జ్వాలభంగి, “అర్చిర్హేతిశ్శిఖాస్త్రియా" మ్మని అ. ఉగ్రమైనప్రతాపముతోడ, కలితుఁడు = కూడినవాఁడు, ఉరుదండనీతియందు, భార్గవుఁడు = శుక్రునిఁబోలినవాఁడు, ధరణి = భూమిగలవాఁడు, పార్థాఢ్యుఁడు = పృథాపుత్త్రజ్యేష్ఠుఁడు, అవరజస్థితిన్ = తమ్ములకూటమిచేతను, బంధురాజి = ఆత్మజనసహాయముయొక్క, అవిరళరతిన్ = అధికానురాగముచేతను, చెలంగెను.
రామ. అట్లాత్మ నెంచి, నయ = నీతిచేత, ఋద్ధ = వృద్ధిఁ బొందింపఁబడిన, “అద్గుణః” అని సూ. రాజ్యమహిమచేతను, తేజ = ప్రతాపముచేతను, ప్రదీపుఁడు, ఆరాజు = దశరథుఁడు, అనుపమాన = అసమానమైన, సపర్యాప్తిన్ = పూజావిధిని, "సపర్యా తర్పణం బలిః" అని అ. నెరపుచు, సప్రణతిగన్ = సప్రణతిసహితుఁ డౌచు నుండఁగా -