Jump to content

పుట:రసార్ణవాలఙ్కారము (ప్రకాశవర్షుఁడు).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుక్తి 6 విధములు: 1. పద 2 పదార్థ 3. వాక్య 4. వాక్యార్థ 5. ప్రకరణ 6 ప్రబన్ధయుక్తులు.

భణితి 4 భేదములు:-1. సంభావనారూపము. 2. అసంభావనారూపము. 3. కల్పనారూపము. 4. విరోధరూపము.

శ్రవ్యత 6 తెగలు:-1. ఆశీరూపము. 2. నమస్క్రియారూపము. 3. నాందీరూపము. 4. వస్తురూపము. 5. బీజరూపము. 6. ప్రరోచనారూపము.

శ్లేష 6 రకములు:-1. ప్రకృతి, 2. విభక్తి, 3. పద, 4. వచన, 5. భాషా, 6. ప్రత్యయశ్లేషలు.

ఔచిత్యము 2 విధములు:-1. అభిధానౌచిత్యము. 2. బన్ధౌచిత్యము.

[ఔచిత్యమును గూర్చి విపులముగ నెఱుఁగఁ గోరువారు క్షేమేంద్రుని 'ఔచిత్యవిచారచర్చ'ను బరిశీలింపఁదగును. ఔచిత్యమే కావ్యమున కాత్మ యని యీతనిమతము.]

ప్రశ్నోత్తరము 6 విధములు:- 1. అంతఃప్రశ్న. 2. బహిఃప్రశ్న. 3. ఉభయప్రశ్న. 4. పృష్టప్రశ్న. 5. ఉత్తరప్రశ్న. 6. జాతిప్రశ్న. ఈప్రశ్నోత్తరమునుగూర్చిన విశేషములు నరయఁగోరువారు 'విదగ్గముఖమండనము'ను బఠింపఁజను నని ప్రకాశవర్షుఁడే చెప్పియున్నాఁడు. ప్రకాశవర్షునికాలనిర్ణయమున కీగ్రంథ మెట్లుపయోగించునో కాలనిర్ణయప్రకరణమునఁ జూచునది.

ప్రహేళిక 6 విధములు:- 1. పరివర్తితము. 2. విన్యస్తము. 3. లుప్తము. 4. వ్యుత్క్రమము. 5. బిందుకము. 6. ఆర్థము.

[భామహుఁడు ప్రహేళికకు లక్ష్యముం జూపక, ప్రహేళికకు యమక మని నామాంతరము గల దనియుఁ దద్విశేషముల రామశర్మకృతమగు ‘అచ్యుతోత్తరము'నఁ జూడఁదగు ననియు నుడివెను. [భామహ. II. 19.] దండి యమక మేకాంతమధురము కాకపోవుటచేఁ దరువాత దీనినిగుఱించి చెప్పెద నని [కావ్యాదర్శ. I. 61] నుడివి, తృతీయపరిచ్ఛేదమున 14 ప్రహేళికాభేదములను సోదాహరణముగా వివరించియున్నాఁ