Jump to content

పుట:రమ్యా లోకము.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


ఏ ప్రఫుల్ల పుష్పంబుల నీశ్వరునకు
పూజ సల్పితినో యిందు పుట్టినాడ :
కలదయేని పునర్జన్మ ! కలుగుగాక
మధుర మధురం బయిన తెను మాతృభాష.

ఈ యనంత చైతన్య బృంహితమయిన జ
గత్తులో జన్మభూమి స్వర్గంబ యగును;
తద్వియోగంబె నరక బాధా ప్రవృత్తి
తల్లినుడి కంటె పరమామృతంబు లేదు !

ధర్మ మనుడు, యోగ మనుండు, తత్త్వ మనుడు,
ప్రాణి సాధింపగల పరమార్థములకు
తల్లిభాష ప్రధాన సూత్రంబ యగుట,
భాషకంతె నవ్యులకు తపస్సు లేదు !

అరవల పదాలంచు కొన్ని అంకిలించి,
కన్నడుల ముక్కలని కొన్ని కలవరించి,
ఆంధ్ర భాషా సువర్ణ సస్యంపురాశి
తూరుపాఱ బట్టు విపశ్చితులకు వినతి.

2