Jump to content

పుట:రమ్యా లోకము.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యా లోకము

1


మూడుకోట్ల జీవత్కంఠముల అహర్ని
శల్ ప్రతిధ్వనించుచు, ఈ విశాల సుంద
రాంధ్రభూనభోంతర పరివ్యాప్తమయిన
అమృతశబ్దావతారము నాశ్రయింతు !

నన్నయాక్షర రమ్య ప్రసన్న ఫణితి
సోమయాజి అధోన్ముక్త సునిశితో క్తి
పొదివి పోషింప, సర్వతోముఖ వికాస
భాసురంబైన కావ్య సౌభాగ్యమెంతు !

శోభలెగయు తారకల రాసులకు నడుమ
దర్శనీయమౌ క్షీరపథంబు పగిది;
దేశభాషా ప్రవాహ వీథికలలోన
తెనుగుపాయ రంజిలు తేనె తొనుకులాడ.