Jump to content

పుట:రమ్యా లోకము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము



కళలు కుసుమింప, రూపురేకలు రుచింప,
పలుకులు నయింప. ముదితచేష్టలు హసింప,
జగదధిష్ఠాన సుందర స్వామిని వలె
నొలయు చెలియ బ్రహ్మానంద సోదరి యగు.

స్థాయి రతిలేని బహ్వవస్థల రుచించు
ఆప్తశృంగారమును భావమనిరి ; కాని
మూఢమగుటయు రసము సంభోగమున, వి
యోగమందు ఉవ్విళ్లూర్చి లాగ గనమె.

పార్వతీ పరమేశ్వర బాంధవమున,
భారతీ బ్రహ్మదేవ దాంపత్యమందు,
విషయ సురత ప్రసక్తి భావింపగలమె ?
రస మనౌచిత్యమున మలీమసమయమగుట.

యామినీ చంద్రులకు మిధునానురక్తి,
పద్మినీ మిత్రులకు వధూవరుల వలపు,
గారవించిరి కవులు శృంగారకృతుల ;
సురత మేది ? ఆ ప్రకరణాంతరములందు.

41