పుట:రమ్యా లోకము.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము

సురత సంస్పర్శలేని ఈ శుచి మదమల
జీవితానురాగాదులన్ చిలకరించు
కానరాని శృంగార ; మాకర్షణ ప్ర
భావ విమలోపచార సుఖావహముగ.

ఇంతలేసి కాటుక కన్ను లెదురుకోలు
నందుకొనగ, పువ్వుల బంతులాడ నవ్వు :
మార్గమడుగ బిత్తరవోయి నిర్గమించు
గ్రామకన్య వాలకము శృంగారమందు.

స్నానమాడి, పెన్నెరు లఱజాఱ ముడిచి
నొసల కుంకుమ, పాదాల పసుపు మెఱయ,
క్షీరశాటి తాలిచి తులసిని భజించు
ధీర రూపము మాతృశృంగారమగును.

శుభకళా కాంతి లక్షణ స్ఫోరకమయి
విలసదభినవ సౌందర్య బింబమయిన
పుత్ర శృంగార, మాకర్ష పూర్ణమగుచు
లాగదే ముద్దులాడ నెల్లరను జగతి ?

85