పుట:రమ్యా లోకము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము



రమ్య సౌందర్య లహరీ తరంగశయ్య
నీ యలౌకిక శృంగారమే స్ఫురించు,
సదమలంబయి పూర్ణమై సహజమైన
మాతృ శిశుబంధ మధుర ధర్మమును నిదియె.

ఏకదేశ నిష్ఠంబైన ఈ యమేయ
దివ్య శృంగారమునె గుఱితింత్రు నేడు
నవ్య కవికులపుత్రు; లనంతమయిన
ప్రకృతి యందును మానవ ప్రకృతియందు.

భువన సంమోహనుండైన పురుషు నరసి
'ఇతని కిచ్చిన తల్లి యమృతకలశము
లెంత ధన్యములో ' యని నిచ్చమెచ్చు
సతుల నెఱుగ మెందఱిని వాత్సల్యరతల.

అతి బలాత్కార రక్తలై, యదు కిశోరు
పరమ సౌందర్య మహిమ కవశ్యలయిన ;
గొల్లభామల లీలన్ గోచరించు
నీ యబోధశృంగారమే యిగురువోసి.

42