పుట:రమ్యా లోకము.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకముశీల మట్టుల నౌచితిన్ చెదరనీక,
అహివిధాన నశ్లీల మనాదరించి,
ప్రేమసూక్త మహోపాసనామయు లగు
నవ్యుల కుపాధియయ్యె సౌందర్య మొకటె.

కళలు రమ్యార్థ సౌభాగ్య కల్పనములు
సంవృతమ్ములు శాస్త్రబీజమ్ములందు ;
మధుర కండరసార మాంసలము లయిన
పండ్ల లోపల విత్తులభంగి నంతె.

భావ సంపన్నమయిన కావ్యమున, భగ్న
భాగ్య బీభత్స పిండనపర్వ మేల ?
కాయగూరల క్షుత్పీడ మాయగలదు,
చిత్త శోభాపిపాస నే శీధు వార్చు !

క్షీరము దధియై వెన్నయై ఘృతమయి సుఖ
సేవనల కగు శుచిరుచి శేషమగుచు;
కటు కఠోర కరాళ కంకాళ కృచ్ఛ్ర
కశ్మలాదులు తీర్చు నే కామ్యములను.