ఈ పుట ఆమోదించబడ్డది
రమ్యాలోకము
ఈ విలక్షణ పరిణామ మెఱిగి కాదె
రుచిమ దిష్టార్థదోహన ప్రచురశబ్ద
సరమునే కావ్య మనియె ఆచార్యదండి;
లక్ష్యలక్షణ సమవాయ లాఘవుండు.
రసము లుదయించు వస్త్వంతరములు భిన్న
మయ్యు రుచి నభేదప్రాయ మగును తుదిని;
పాలలోన చెఱకులోస పూలలోన
పుట్టియును, మాధురియె అనుభూతి కాదె.
హాస భాషావలోకనోల్లాస రూప
చేష్టితముల సౌందర్యమాసించు నిజము,
ఏత దనువర్తనోత్ఫుల్ల రీతులెల్ల
నెలవు లగును శృంగారమున్ నిలువరింప.
విప్ర లంభసంభోగముల్ విస్తరించి,
సంగ్రహించిరి శృంగారశాఖ లయిన
స్నేహవత్సలాదుల; నతిస్నిగ్ధహృదయు
లగు కవుల కిపుడవి వరేణ్యంబు లయ్యె.
37