పుట:రమ్యా లోకము.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


11


కావ్యమందు నిర్దిష్టార్థ కలనకంటె
రసవ దిష్టార్థమే పరిగ్రాహ్య మగుట,
కవివచోవై ఖరియు, రసజ్ఞప్రసాద
నవనవస్ఫురణయు, ప్రమాణంబు లిందు.

సరసకావ్యార్థము లభిధావరణ మెడలి
లక్షణావ్యంజనా వీధులన్ భ్రమించు;
పూవు విడిచి వాయుతరంగముల నపార
దూర మేగెడి పరిమళ సారమట్లు.

సకల మానవసంతాన సహజమైన
తను విభావానుభావ బంధమును, అనుక
రించు హ్లాదైక రమణీయరీతుల కృతు;
లానుషంగిక మం దితరాంశ చర్చ.

35