Jump to content

పుట:రమ్యా లోకము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము




తెల్లచుక్కల కరియాల నెల్ల పిదికి
పయి నిడిన క్షీరభాండంబు పగిలినట్లు;
వఱదగట్టెను బ్రహ్మాండ భాగమెల్ల
పచ్చివెన్నెల పాలయి ప్రాణులలర.

సందె కోపించి రక్తము చిందులాడ
సాగిపోయే నావలకు ఆశలను విడిచి;
చుట్టుకొన్న ఆ తమిలోన సురిగిపోయె
విఱుపు లందిన బొమ్మల మురిపెములును.

నా మనోరాగమే వసంతమున కాంత
లసదరుణ పల్లవము లయి మిసమిసాడె;
పంచమశ్రుతి రతిని జీవములు తనియ
చక్కమ్రోయించె కలకంఠ జంత్రములను.

మధుపరాయణమయి రక్తి మరగి, రాగ
భోగముఖమున సోలిన భూమినెల్ల
తప్త మొసరించి, జాడ్య ముక్తముగచేయ,
కఠిన శిక్షాకరుం డయ్యె కర్మసాక్షి

29