పుట:రమ్యా లోకము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము



ఆ తపంబు నార్ద్రాంబర మడ్డుకొనగ
కడల మెఱుగుల యలకలు జడలు పడగ,
నిలిపి షడ్జశ్రుతిని, వన్నియల నెమిళ్ళ
నాట్యమాడించె నెల్లెడ నాదు వలపె !

కట్టువడి, దుర్దినాలలో కాలు బయట
పెట్టని పయస్వినులకు లభించె మరల
స్వాదువయిన శాద్వల పత్రపారణంబు
నాతి శుష్కపంక సరి దుపాంతములను.

శాంతముగ నూర్ధ్వలోకవాసమున మెఱయు
శుచిముఖకులంబు సంక్రాంతి సోమతీర్థ
మరయ దిగినట్లు హిమతారకా కృతులను
నిండె నులాసమయ మహీమండలమున.

పరమ వైఖానసులు పురాపాపకర్మ
సంచిత విముక్తు లగునట్లు, సకల జీర్ణ
పటలముక్తులయిరి వనస్పతులు గూడ,
బలవ దవసాన ఋతు పరిపాక సిద్ధి.

30