ఈ పుట ఆమోదించబడ్డది
9
చివర మొదలును లే కవిచ్ఛిన్నమైన
కాలమంత వసంతమై, కఠిన దీర్ఘ
దివసమై, దుర్దినంబయి, దివ్య శరధి
యై, హిమార్ద్రమై, శిశిరమై యాడె నెదుట.
తూర్పు కొండ పొలాన ఒత్తుగను మొలిచి
పొడవు పెదిగిన కుంకుమపువ్వు గోసి,
ఏడు గుఱ్ఱాల శకటాన నెత్తిత్రోలు
మిత్రు డొక్క, డాశలు సొంపుమీఱి మెఱయ.
తూలు తమ్ములు నిదురింప జోలపాడి,
మేలుకొను కల్వలకు వేడి పాలు పోసి,
నిశికి నునుపారు కురుల నూనియలు పూసి,
సందుగొందుల బడి జాఱె సందె ధాత్రి.