Jump to content

పుట:రమ్యా లోకము.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకముఇరుగు పొరుగు సీమలలోన మెఱుగులొలుకు
పలుకు లను జాతిసానల పలకదీర్చి,
తెనుగు బంగారుతీవె సూత్రింతు రెలమి,
చేతనాహ్లాదరమణీయ శిల్పి రచన.

పాలలో వెన్న లీనమై గ్రాలు లీల
శబ్దమందు అర్ధంబును చక్క నెసగు ;
ఒకటి యాస్వాదనీయమై యుత్సవించు,
ఒకటి హృదయంగమంబుగా నుపకరించు.

ప్రాతవయినంతనే త్యజింపరు, నవీన
మయినమాత్ర వరింపరు ; ప్రియములై స
హృదయ సేవ్యమానములైన వెల్ల, స్వీక
రించి భావాంబర మలంకరింతు రర్థి .

చిర యశః స్థాయి గొనిన ప్రాచీన సుకవి
వాఙ్మయమునందు ఆకర్షవంత మయిన
రమ్య భావకలాపమున్ , శ్రావ్యమయిన
శబ్దరీతి విధానమున్, సంగ్రహింత్రు.

22