పుట:రమ్యా లోకము.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


సంస్కృతము తల్లి యెల్లభాషలకు నండ్రు
ధాత్రియందు ; ఈ తల్లి యుత్తమ సువర్ణ
వైభవమును సంతానంబు పంచుకొనదె ?
జన్యజనక బాంధవ విశేషముల కొలది.

శ్రుతిహితం, బుదాత్త స్వర స్ఫురితబంధ,
మయిన సంస్కృత భాషాప్రియ ప్రసాద,
మార్ష ముఖశుచి మద్వరేణ్యంబ యగుట
ఏల బిడ్డ లాస్వాదింప మైలపడును !

ఆసరస్వతి ము న్నదృశ్య యయిపోయె
నండ్రు ; భావింతు నేను తదమృతజీవ
నము సమస్తము భాషా స్త నంధయముల
కిచ్చి, తాను కృశించిన దేమొ యనుచు.

అన్య దేశ్యంబులను, ప్రాకృతాది సరళ
వాఙ్మయస్థ శబ్దంబులన్, పాటెరింగి
నుడికరింతురు జాను తెనుంగునందు;
మధురి మార్థ గౌరవముల్ ప్రమాణములుగ.

21