పుట:రమ్యా లోకము.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకముకాని, వారల వలెనె అఖండమైన
సృష్టి వైచిత్య్రమును, ప్రాణిచేతనా వి-
కాసమును, స్వతంత్రముగ లక్ష్యమున నిలిపి
స్వానుభవ భాష్యములు విప్ప సాహసింత్రు.

“ప్రాతగిలిన మాత్రాన భవ్యములు కావు
నవ్యమైన మాత్రాన నింద్యములు కావు"
అందచందము, లభిరుచి ననుసరించు
దేశ కాల పాత్రానువర్తితము లగుట.

వాణి వాయింప మ్రోగిన వీణ మీద
పారసీక గీతంబులు పలుకమనెనె !
ఋషుల నీవారములు ఫలియించినట్టి
పొలములందు గులాబీలు పూయమనెనె !

చోద్య చోదక సామర్థ్య సూత్రమయిన
వాక్కుచే విలక్షణులైరి ప్రజలు ; అందు
సుకవి కంఠము ఛందోవిశుద్ధి నంది
శబ్దసంమేళన క్రియాచతురమయ్యె.