పుట:రమ్యా లోకము.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

7


“హృద్యమై, రసమయమైన, ఈ యపార
కావ్య సంసారమందు సుకవి యొకండె
బ్రహ్మ; ఏతదభీష్ట ధారా తరంగి
తముగ అనురణించు సుమి శబ్ద ప్రవృత్తి."

భిన్న పరిమాణ వర్ణసంపన్నము లగు
గణగణ నిబద్ధ వృత్తవాక్యముల కొదవు;
అశిథిలారోహణావరోహణల యందు
స్వరవళుల కబ్బు రాగసౌభాగ్యరక్తి.

అభినయమున, గ్రీవాభంగహస్త భరణ
భ్రూకటాక్ష విక్షేపాది ముదిత కలన
లాస్యవతి కబ్బు సొగసువాలకము బోలు;
వృత్త విన్యస్త శబ్ద ప్రవీణచేష్ట.

19