పుట:రమ్యా లోకము.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


కావ్యముల్ త్రయీ మంత్రముల్ గావు, జన్మ
మోక్షసంధాన పరయోగములును కావు;
ప్రాణి యంతఃకరణవృత్తి భావమయ మొ-
నర్చి మృదులీకరించు ఆనందకలలు.

బహుజన ముఖోపచార సంపన్నము లయి
శబ్దకులము లుజ్జీవసౌష్ఠవము నందు;
కవులు వరియింత్రు సంప్రయోగముల వాని,
వార్తికానుశాసనము లావల ఘటిల్లు.

కావ్య భాషణాదికము వర్జ్యమని ఆంక్ష
పెట్టినారు తత్త్వవేత్త లెపుడొ !
దాని మాప దీర్ఘ తర్కంబులను బెంచి
లలితదృష్టి విడిచె లాక్షణికుడు.

కవికి తాత్త్వికునకు కయ్యంబె సాగెను
బహుదినాలు వాక్ప్రపంచమందు,
రాగరక్తు డొకడు, రాగముక్తు డొకండు;
సగుణ నిర్గుణముల సఖ్య మెట్లొ ?

18