Jump to content

పుట:రమ్యా లోకము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


మృదుల సరళాక్షరముల సంమేళనమున
ఆర్ద్రనవనీత మార్దవమందు నుడులు
శ్రవణసుఖ మిచ్చు సులలితోచ్చారణమున,
భంగిమ యటందు రీ పదబంధసరణి.

ఈ పలుకుబడి తీపిఘటిల్లె తెనుగు
భాషకు నిసర్గమోహన భూషణముగ;
మధురస ధురీణమయిన సుమమ్మునకును
అందమగు రంగురేకుల పొందికవలె

వదల రీ వృత్తపద మృదుబంధ మెందు
నవ్యులు రసవద్వాక్య సంధానమందు;
సంధులు విసంధులైనను, సాంస్కృతములు
దేశ్యములతోడ సమసించి, తీవె గొనిన.

సుప్రసిద్ధ దేశ్యంబులన్ శుద్ధసంస్కృ
తములతో కల్పదగు సంప్రదాయ మనడె
వామనుడు ? శ్రవణ సుఖంబు పాయదేని
అవిరళింతు రీ భంగిమ నాధునికులు.