పుట:రమ్యా లోకము.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


పాములు విసంబు గ్రక్కెడు ప్రాంతమందు
జంతురక్తము పడ ఘాత జరిగియుండు;
పూలపాలు కాల్వలు గట్టు పొలములందు
పాడి యావులమందలు ప్రబలియుండు.

కోకిలలను వేటాడిన కాకులెల్ల
భూపిశాచ దుష్కంఠులై పుట్టిరేమొ ?
పాటల ప్రవాహములలోన బడినరాళ్ళు
మృదుల కలభాషిణులుగ జన్మింపనోపు !

పైరగాలికి తలవంచి పసుపు మించి
ఉల్లసిలిన వెదుళ్ళు రూపొందె నేడు,
మందమకరంద హృదయంగమస్వరాను
కూల వీణారణన సూత్రకులము గాగ.