పుట:రమ్యా లోకము.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

5


మండు టెండలన్ కాలి, అఖండ వర్ష
పాతముల బడి బ్రద్దలై, పంకసంకు
లంబయి, అతల కుతలమై, లవము విసువు
నొంద దీ పృథివీదేవి, యోర్పదెంతొ !

కుమిలి క్రుళ్ళిన వస్తుచయము గ్రసించి
సుభగభూతిగా మార్చు నీ శుద్ధమూర్తి,
వక్షమున దాల్చి కొండల బరువుమోయు
కడుపుగోయు నాపగలను గారవించు.

ప్రాణులకు సరసాన్నముల్, వ్యాధులకు మ
హౌషధుల్, సుఖసాధన పోషణలకు
దివ్యఫలపుష్పఋతు కళా దృశ్యములు, స,
మృద్ధముగ నిచ్చుతల్లి నర్చింపరాదొ ?

15