Jump to content

పుట:రమ్యా లోకము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6


నాదమూలము లగు మోహనపు కళలను
గాన కావ్యము అధిక రక్తంబులయ్యె,
స్వరమయము గీతి; కావ్యము భావమయము;
పదపదార్థక్రియాశాలి భావ మెపుడు.

భావగతి కవలంబన వాక్యమగుట,
వాక్యసంధాత కవియౌట వాఙ్మయమున.
శాబ్దికుడు ధూర్వహుండు కాజాల డెపుడు;
అవయవ విభాగమెటు లవయవిని దిద్దు?

పంచభూత చిత్రితమౌ ప్రపంచ మరసి,
ప్రాణికుల మోదభేద తత్పరత నలరి,
ఆపజాలని భావోచయము వెలార్ప
ననుకరించె వానిని స్వకావ్యముల సుకవి.

17