పుట:రమ్యా లోకము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


మగధ సామ్రాజ్యమును ధరామండలమున,
మిధునశృంగారమును వచో మేరుతటుల,
హాలు డాదిగా నేలిరి; ఆంధ్రజాతి
కవుల తోబుట్టు వీ కావ్యకనకపుత్రి.

రసములకు నెల్ల శృంగారరసము తల్లి
యనిరి పూర్వులు సంభోగ మవధి గాక;
అక్షరానందసిద్ధి లక్ష్యముగ నెంచు
నవ్యులకు నది అప్రధానముగ మెలగె.

విషయమయమైన సంభోగ విధి జగాన
క్షయమయయ్యు రూపాంతర సంగ్రహమున
సుప్రజాతంత్ర నిర్వాహసూత్ర మగుట;
తలచెదరు దంపతీనిష్ఠ ధర్మముగనె.

మూఢు లిచ్ఛయించెదరు సంభోగసుఖము,
నే వియోగ మాధుర్య లీలావిపాక
మనుభవింప నఱ్ఱాడెద ననడె యాంధ్ర
రసిక కులరాజు పండితరాజు తరిచి.

12