పుట:రమ్యా లోకము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


ఇట్టి సౌందర్య మీ సుప్రకృతి ధరించు
బహు విధాల అనంతరూపముల నెపుడు;
రక్తినర్చింతు రభిరుచి క్రమముకొలది,
శిల్పులును గాయకులు కవిశేఖరులును.

కరుణ శృంగారములు రెండె కావ్యమందు
నిజ రసవిపాక భోగమందింప గలవు;
సహజపూర్ణ చిన్మయ సుఖాస్వాదనమున,
శోక మధిత మనోదోష శుద్ధికలన.

సృష్టికొక్క సుస్థాయి అభీష్టమేని
శాంతమగునది విషయ విశ్రాంతిమయము-
సంయమించిన ఇంద్రియ స్థాయిపదము-
సాహితీ రస పర్యవసాయి అదియె.

ఏతదమల సౌందర్యార్చనాతిరేక
మాత్మభావన నానందమై ఫలించు ;
జంతువుల జన్మవర్ధనాస్తమయములకు
ఆద్యసూత్ర మానందమే యగును కవికి.

13