పుట:రమ్యా లోకము.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

4


కర్మమో జ్ఞానమో తదైక్యంబొ యగును
నరుని ధర్మార్థకా మోపకరణసిద్ధి
వాగతీతం బనిరి దాని; వాగ్వ్రతు లగు
కవుల కది యెట్లు భోగ్యలక్ష్యముగ నొప్పు ?

మంత్ర మహిమానుభూతి బ్రహ్మర్షి గణము,
నీతి బాహాబలస్ఫూర్తి నృపకులంబు,
నమ్మి విడిచిరే ప్రేమ సూత్రమ్ము; దాని
తడవరాదొ కాంతాసమ్మితముగ నేడు.

చెవికి చక్కెరపాటయై, చవికి చెలిమి
మురిపెముల మూటయై, చిత్తమునకు ముదిత
ముద్దులాటయై, లాలించి పొత్తుగొను ప్ర-
సన్న కావ్య మానందాభిసారికవలె.

11