పుట:రమ్యా లోకము.pdf/16

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


ఖేదమోద ప్రసక్తులన్ భిన్నకుశల
దశలకు వశంవద మగుచు, తన్మయమయి
తన్మయ మొనర్చు సహృదయాంతఃకరణ ము
ఖోపభోగ్యమె, రస మన నొప్పు కృతుల.

కానవచ్చు సౌందర్య శృంగారములకు
అంతరం బనభివ్యక్తమయి ; ఉపాధి
గతము సౌందర్య - మనుపాధికము రసాధి
కారి శృంగార - మఖిలమంగల్యపరము.

రసరతంబైన హృది మకరందపాన
పరవశం బగు మధుకరావస్థ నందు;
తన్మహత్తర కైవల్యధారణాప్తి
కావ్యమందు ఆనందంబుగా స్మరింతు.