పుట:రమ్యా లోకము.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రమ్యాలోకము


పూల కడుపులలో తేనె బోసె నెవడొ:
దాని తీయు నేరుపు తుమ్మెదకు ఘటిల్లె
భాషలోని మాధుర్య లావణ్యభావ
సాధు భోగము కవిముఖసాధ్యమయ్యె'

సృష్టియందె ఈశ్వరుని అర్చింత్రు కవులు,
శ్రుతికి మూలం బగును మాతృ సుస్వరంబు,
కావ్య గీతులు ప్రియసాధకములు ప్రాణి
కమలినానంద మొకడె లక్ష్యంబ యగును.

కలవు రసరామణీయకములు కృతులను
మాధురీ సౌరభమ్ములు మధువున బలె;
రసము లంతఃకరణయోగరంజనములు,
రామణీయక మాకర్ష రమ్యరచన.

స్వాదు మృదుపదసహవాస వాక్యరీతి,
గణసమాసంజిత మనోజ్ఞగతుల కలిమి
నందు చెలువమ్మె రామణీయకము కృతుల;
శ్రావ్య మగుచు నాకర్షించు ప్రాణితతిని .