పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గౌరి – రామా! నీవుయింత క్రూరుడవవుతావని నేనుయెన్నడు అనుకోలేదు. నీవు నామతిపోగొట్టివేసినావు. (అని యేడ్చుచున్నది.)

రాము – నీకేమీభయములేదు యేడువకు. ఆపిచ్చివాడు నీ జోలికి రాడులే. ధైర్యంగావుండు.

గౌరి – నీవు చెప్పినమాటలు విన్న తరువాత మళ్ళీదైర్యంయేలా వస్తుంది! మూర్ఛవస్తూవున్నది. ఇదుగో మూర్ఛపోతూవున్నాను.

(అని సోలుచున్నది.)

మతి - (వెలుపలనుండి) రామా! రామా!

రాము – అయ్యో! అయ్యగారు పిలుస్తూవున్నారు.

గౌరి - ఇటువంటి మూర్ఛలో నీవునన్ను వదిలిపెట్టి వెళ్ళ కూడదు.

రాము — మూర్ఛపోవడానికి ఇదిసమయంకాదు. మనయజ మానుడు జపంమీద కూర్చున్నప్పుడు సమయం కనిపెట్టి చెప్పుతాను. నీవప్పుడు కావలసినంతసేపు సావకాశంగా మూర్ఛపోవచ్చును. ఇప్పుడు లేచి వేగిరం యింట్లోకి పరుగెత్తు.

గౌరి - నీమాటప్రకారం నడుచుకుంటాను. (అని లేచి వెళ్ళు చున్నది.)

(అంతట మతిమంతుఁడు ప్రవేశించుచున్నాఁడు.)

మతి - ఓరి మొద్దా! పిలవగానే యెందుకురావు? నీవు యెప్పుడు దానితో పరియాచికాలాడుతూ కూర్చుంటావు.

రాము – అలాగంటిపని నేనుయెప్పుడూ చెయ్యడంలేదండి. అదే నన్ను పరియాచకాలు చేస్తూవుంటుంది.

మతి - చాలును. ఈపాటినోరుమూసుకో. ఈవేళ మనయింటికి నామేనల్లుడు వస్తూవున్నాడు. అతనికి కొంచెం చిత్తచాంచల్యం.