పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాము — నేనుచేసేపనే నీవుచేసేటట్టయి తే నీవునాకంటె యెక్కు వసణుక్కుందువు. పురుగులు దులిపివేసి వక్కపుస్తకానికి వర్ణంవేస్తే నాకువుండేకష్టం నీకు అప్పుడు తెలుస్తుంది. ఓసీ! గౌరీ! ఈరోజుమన యింటికి యెవరోవస్తారట! యెవరువస్తారో యెరుగుదువా?

గౌరి - యెరగను. యెవరో మంత్రాలు తెలిసిన యోగులు వస్తారనుకుంటాను.

రాము – కాదు కాదు. వకపిచ్చవాడు వస్తూవున్నాడు.

గౌరి - పిచ్చవాడా! నాకు భయం వేస్తూవున్నది. అతను యెవ రినీ కొట్టేతిట్టే వాడుకాడుగద.

రాము — ఏమోతెలియదు. అతడు మనయజమానుడికి జతగా వుంటాడు. అయినా కానీ అతడుకూడా తాను వచ్చేటప్పుడు పాత తాటాకుల పొస్తకాలు యేమయినా తెస్తాడేమోనని నాకూ భయం గానే వున్నది.

గౌరి - పొస్తకాలు తెస్తేనేమికాని అతడుకొట్టేవాడవునో కాదో కనుక్కుని ముందుగా చెప్పుదూ.

రాము – కనుక్కో నక్కరలేదు. వాళ్ళకుకొంచెం వ్యతిరేకంగా యేమయినా చేసినా అన్నా పిచ్చివాళ్ళందరూ కొడుతారు. నీవు జాగ్ర తగా వుండవలెను? నీవు అతను చెప్పినట్టల్లా చెయ్యకపోతే నీ కొప్పులో వెంట్రుకలు నాలుగూ వూడదీసి చేతులో పెడుతాడు.

గౌరి – అలాగైతే నాకుమరీభయంవేస్తూవున్నది. మూర్ఛ వస్తూవున్నది. (అనిమీద పడఁబోవు చున్నది.)

రాము – గౌరీ! దూరంగాపో. ఇక్కడ మూర్ఛపోకు. నీకు మూర్ఛపోవడం యిష్టంగావున్నట్టయితే లోపలికిపోయి నీళ్ళపొయికాడ నిప్పులలోనూ నీళ్ళలోనూ మూర్ఛపో.