పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాము – అదియేమిటండీ?

మతి - మరేమీలేదు. మతిభ్రమవస్తూవుంటుంది.

రాము - మీరు చెప్పినవేవో నాకు తెలియవు. ఆవచ్చేవి రెండూ యేవో జంతువులనుకుంటాను. అవియేమీ హానిచేసేవి కావు గద?

మతి – జంతువులూలేదు నీ మొఖమూలేదువూరుకో. నామేన ల్లుడి విషయంలో నీవే చాలాశ్రద్ధ పుచ్చుకోవలెను. అతణ్ని నీవు యెప్పుడూ కనిపెట్టివుండి చూస్తూ మంచిమాటలుచెవుతూ కోపం రాకుండా చెయ్యవలెను. అతణ్ని రెచ్చకొట్టినావంటే నీతలకాయబద్దల కొడుతాడుసుమా. జాగ్రత. అతనికి యెప్పుడూ చిరాకు తెప్పించకు.

రాము - తెప్పించను. అతనిమీద యెప్పుడూ వకకన్ను వేసి జాగ్రతగా వుంటాను.

మతి - (ఆలకించి) అదుగో బండీచప్పుడవుతూ వున్నది. అతను వచ్చినట్టున్నాడు. రామా! అతణ్ని నీవువెళ్ళి లోపలికి తీసుకునిరా.

రాము — చిత్తము. (అని వెళ్ళుచున్నాఁడు)

మతి – సదానందయోగికిన్నీ గజాననదాసుకున్ను వర్తమానం పంపించినాను. వారుయిద్దరూవచ్చి యితణ్ని సావకాశంగా పరీక్షచేసి చూచి జబ్బుయొక్క స్వభావం నిశ్చయంచేసి చెపుతారు. వారు యిద్దరూ నిస్సందేహంగా చిత్తచాంచల్యమనే నిశ్చయం చేస్తారు. పాములమంత్రగాడు తాచుపామును వశ్యంచేసుకున్నట్లు నేను యీ రోగిని యోగదృష్టిచేతచూచి నిముషంలో లోబరుచుకుంటాను. యోగ మహిమ కనపరచడానికి యిప్పుడు మంచి అవకాశం కలిగింది. మనో బలంచేత యెటువంటి రోగాలనైనా మళ్లించవచ్చును. అతడు యెంత అల్లరిచేస్తూవున్నా మనస్సు స్థిరపరిచి తేరపారచూచినానంటే యోగ