పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నిద్రచేత చిత్రపు ప్రతిమలాగు అయిపోతాడు. అడుగో అతను వస్తూ వున్నాడు. నేనులోపలికి వెళుతాను. అతణ్నిచూస్తే నాకు దేహం పులకరిస్తూవున్నది. (అని వెళ్ళుచున్నాఁడు.)

(సుబలుఁడును రాముఁడును ప్రవేశించుచున్నారు.)

సుబ - పడవలు కొంచెం ఆలస్యంగా బయలుదేఱినా యెలా గైతే నేమి కష్టపడి అనుకున్న వేళకు యిక్కడచేరినాము - ఓయి రామా మా సామానంతా లోపల యేదైనాగదిలో పెట్టించు. ప్రయా ణం తొందరలో రాత్రినేను తిన్నగా భోజనం చెయ్యలేదు. ఆకలివేస్తూ వున్నది. వంటయిందేమో కనుక్కునిరా.

రాము - (ఇల్లునాలుగు ప్రక్కలనుచూచి) వీటీతో యెవరినీ కొట్టడానికి యితనికి అవకాశం లేకుండా చేస్తాను. (అని గోడమూలల నున్నచేతి కఱ్ఱలన్నియు పోగుచేయుచున్నాఁడు.)

సుబ — (కోపముతో) ఓరీ! నీతో నేను చెప్పినపని యేమిటి? నీవు యిక్కడ చేస్తూవున్న పనియేమిటి?

రాము — చిత్తముచిత్తము. వెళుతూవున్నా ను. (అని కఱ్ఱలు చేతఁబట్టుకొని నడుచు చున్నాఁడు.)

సుబ - వీడిమోస్తరు చూస్తే తమాషాగావున్నది. ఇక్కడ వుంటే నేనాకర్రలు యెత్తుకుని పారిపోతాననుకున్నాడు కాబోలును. ఈ సావిట్లో నేను యిదివరకు కూర్చుని నాలుగుసంవత్సరాలు అయింది. అప్పుడు నేనూ సుమతీ యెంతో వినోదంగా ఆడుకుంటూవుండే వాళ్ళము. సుమతి యీపాటిబాగా పెద్దదయి వుంటుంది. అప్పటికే యెంతో అందంగా వుండేది.