పుట:యోగనిద్రా ప్రహసనము కందుకూరి వీరేశలింగం 1950.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[అంతట గౌరి ప్రవేశించుచున్నది.]

గౌరి - అయ్యా! మీరు నామనవి చిత్తగించవలెను.

మతి - ఓరీ! నీవీగౌరిని పెళ్ళాడుతావా? నిన్ను క్షమిస్తాను.

రాము — ఏమి? గౌరీ! నన్ను పెళ్ళిచేసుకుంటావా?

గౌరి – అయ్యగారి యిష్టంవుంటే నేనువద్దంటే మానుతుందా?

మతి - (తనలో) బావా మరదలూ వాళ్ళు యెట్లా మాట్లాడు కుంటూవున్నారో!

సుబ — మామగారూ! మీ స్నేహితులను పంపించి వారిచేత నన్ను కావలసినన్ని ప్రశ్నలు వేయించినారు. మిమ్మలిని నేనువక్క ప్రశ్న వేస్తాను. దానికిజవాబు చెప్పండి. మీకొమార్తెను నాకుయి స్తారా యివ్వరా చెప్పండి.

మతి - అమ్మాయీ! యిదేమిటి? ఇతని జబ్బుసంగతి నీ వెరుగు దువుగదా?

సుమ - ఆ విషయంలో నా కేమీ భయంలేదు. నేను వుపచా రంచేస్తూవుంటే యితని కన్నీ పిచ్చలూపోతవి.

సుబ - ఆమాటనిశ్చయం. మీరావిషయంలో యేమిభయ పడవలసిన పనిలేదు. యిప్పుడు నేనుమీకు మంచివాణ్ని కాననితోస్తే యిఖముందైనా మీచేత నిజంగా మంచివాణ్ననిపించుకోవడానికి ప్రయ త్నంచేస్తాను. నానడతవల్లనే మీకన్నీ తెలుస్తవి.

మతి - అమ్మాయీ! నీచుట్టూపిచ్చకొడుకులనూ పిచ్చకూ తుళ్ళనూ పెట్టుకోవడానికి నీకు యిష్టంవున్నట్టయితే నీకోరికకు నేను యేమీఅడ్డంచెప్పను. ఇంతలేసీ యింతలేసీ పిల్లవాళ్ళను నేనునిత్యమూ యోగదృష్టితో చూస్తూ యీకంటితో యిద్దరినీ ఆకంటితో యిద్దరినీ శాంతపరుస్తూవుంటాను. నాయోగమహిమ లోకానికి కనపరచడానికి నాకుముందు మంచి అవకాశం కలుగుతుంది. (సుమతిని సుబలుని చెఱి